KRNL: జిల్లాలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనకు సంబంధించి జరుగుతున్న ఏర్పాట్లపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విజయవాడ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సమీక్షలో జిల్లా కలెక్టర్ కార్యాలయం నుంచి కలెక్టర్ డా. ఏ. సిరి, జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ సహా పలువురు అధికారులు పాల్గొన్నారు. ఏర్పాట్లను పకడ్బందీగా చేయాలని సీఎం ఆదేశించారు.