NZB: రాష్ట్ర ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం స్థానిక సంస్థల ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించాలని పోలీస్ కమిషనర్ పీ.సాయి చైతన్య అధికారులకు ఆదేశించారు. ఇతర శాఖలతో సమన్వయం చేసుకుంటూ ఎన్నికల ప్రక్రియను సజావుగా పూర్తి చేయాలని సూచించారు. బుధవారం నాడు పోలీస్ కార్యాలయంలో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్పై సమీక్షా సమావేశం నిర్వహిచారు.