ADB: స్థానిక సంస్థల ఎన్నికలపై సోనాల మండల కాంగ్రెస్ నాయకులతో బోథ్ నియోజకవర్గ ఇంఛార్జ్ ఆడే గజేందర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. తాజా రాజకీయ పరిస్థితులపై నాయకులతో చర్చించారు. ఆడే గజేందర్ గారు మాట్లాడుతూ.. అందరూ కలిసి కట్టుగా పనిచేసి కాంగ్రెస్ పార్టీ విజయానికి కృషి చేయాలని సూచించారు. ఈ సమావేశంలో సొనాల మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.