KRNL: ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనను దృష్టిలో ఉంచుకొని కర్నూలు జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి బుధవారం ఏర్పాట్లను సమీక్షించారు. నన్నూరు టోల్ గేట్ సమీపంలోని రాగమయూరి వద్ద పార్కింగ్, సభా ప్రాంగణం ఏర్పాట్లను ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా సీఎం ప్రోగ్రాం కోఆర్డినేటర్ మంతన్న సత్యనారాయణ రాజు, ఆదోని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ తదితరులు పాల్గొన్నారు.