ఇరాన్ యుద్ధం ప్రభావంతో భారత్ లో బాస్మతి బియ్యం ఎగుమతి ఆగిపోయింది. ఇప్పటివరకు మొత్తం 4 లక్షల టన్నుల బాస్మతి బియ్యం ఎగుమతులు నిలిచిపోయాయి. దీంతో వ్యాపారులు, రైతులు, మిల్లర్లు ఇబ్బందులు పడుతున్నారు. బాస్మతి బియ్యం ఎగుమతుల్లో ఇండియాది అగ్రస్థానం. అరటి ఎగుమతులు కూడా ఆగిపోయాయి. ఈ సంక్షోభం నివారణ అయితే, తిరిగి వ్యాపారం పుంజుకుంటుందని రైతులు, వ్యాపారులు ఆశిస్తున్నారు.