సత్యసాయి: పుట్టపర్తిలోని చిత్రావతి నది ఒడ్డున పార్క్ నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. ఈ పార్క్ పూర్తయితే భక్తులకు విశ్రాంతి కేంద్రం, స్థానికులకు వాకింగ్, కుటుంబసభ్యులు సంతోషంగా గడపడానికి కొత్త ప్రదేశం లభించనుంది. ఈ ప్రాంతం పర్యాటక ఆకర్షణగా మారే అవకాశం ఉంది. చిత్రావతి తీరాలతో పుట్టపర్తికి కొత్త అందం జత కానుంది.