HYD: జాతిపిత మహాత్మా గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సినీ నటుడు శ్రీకాంత్ భరత్పై సరూర్ నగర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. సేవాలాల్ బంజారా సంఘం జాతీయ అధ్యక్షులు కొర్ర మోతిలాల్ నాయక్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. గాంధీని కించపరిచే విధంగా అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు.