MLG: ఏటూరునాగారం మండలం చెల్పాక అటవీ ప్రాంతంలో ఈనెల 2న గుర్తు తెలియని మృతదేహం మావోయిస్టు దళ కమాండర్ మాడవి లక్కీదని తేలింది. దసరా రోజు నక్సల్స్ క్రమశిక్షణ చర్యల్లో భాగంగా లక్కీని హతమార్చినట్లు స్థానికులకు తెలిపారు. ఛత్తీస్‌గఢ్‌లో ఏరియా కమాండర్‌గా పనిచేసిన లక్కీ మరణంపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది.