పసిడి ధరలు సామాన్యులను వణికిస్తున్నాయి. అంతర్జాతీయ డిమాండ్, ఆర్థిక అంశాల ప్రభావంతో బంగారం ధరలు పరుగులు పెడుతున్నాయి. తాజాగా, దేశీయ మార్కెట్లో ఒక్కరోజే ధర ఏకంగా రూ.2,290 పెరిగింది. ప్రస్తుతం 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,26,070గా ఉంది. 22 క్యారెట్ల ధర రూ.1,16,750కు చేరుకుంది. పెళ్లిళ్ల సీజన్ సమీపిస్తుండగా ఈ ధరల పెరుగుదల సామాన్యులకు ఆందోళన కలిగిస్తోంది.