తమిళ హీరో కార్తీ, కృతి శెట్టి జంటగా నటించిన మూవీ ‘వా వాథియర్’. దీపావళి కానుకగా రిలీజ్ కావాల్సిన ఈ సినిమా వాయిదా పడింది. డిసెంబర్ 5న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నట్లు మేకర్స్ తాజాగా ప్రకటించారు. ఈ మేరకు పోస్టర్ షేర్ చేశారు. ఇక ఈ చిత్రాన్ని నలన్ కుమారస్వామి తెరకెక్కించగా.. సంతోష్ నారాయణన్ మ్యూజిక్ అందించారు.