ASR: చింతపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో చదువుతున్న విద్యార్థులు ఈనెల 10వ తేదీలోగా హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్(హెచ్పీసీఎల్) అందజేస్తున్న ఉపకార వేతనాలకు దరఖాస్తు చేసుకోవాలని కళాశాల ప్రిన్సిపాల్ డా.ఎం.విజయభారతి సూచించారు. డిగ్రీ ప్రధమ, ద్వితీయ, తృతీయ సంవత్సరం విద్యార్థులు దీనికి అర్హులని తెలిపారు. పూర్తి వివరాలకు కళాశాలలో సంప్రదించాలన్నారు.