HYD: శంషాబాద్ విమానాశ్రయం నుంచి సికింద్రాబాద్ కిమ్స్ ఆస్పత్రి వరకు ట్రాఫిక్ పోలీసులు గ్రీన్ చానెల్ ఏర్పాటు చేశారు. విశాఖపట్నం నుంచి బ్రెయిన్ డెడ్ అయిన ఎ.సన్యాసిరావు (67) నుంచి విమానంలో తరలించిన ఊపిరితిత్తులను కేవలం 24 నిమిషాల వ్యవధిలోనే సికింద్రాబాద్ కిమ్స్‌కు చేర్చారు. ఈ ఏర్పాట్లతో ఒక పేషెంట్‌కు విజయవంతంగా అవయవాన్ని అమర్చినట్లు సిబ్బంది తెలిపారు.