NZB: ఎర్రజొన్న విత్తన వ్యాపారంపై ప్రభుత్వ నియంత్రణ లేకపోవడంతో రైతులు ప్రతి ఏటా వ్యాపారుల చేతుల్లో నష్టపోతున్నారు. వ్యవసాయ అధికారులు బై బ్యాక్ ఒప్పందాలు చేసుకోవాలని సూచించినా, చట్టబద్ధత లేకపోవడంతో కొనుగోలు సమయంలో వ్యాపారులు వాటిని పట్టించుకోవడం లేదు. గత ఏడాదిలో క్వింటాలుకు రూ. 3,800 పలికిన ధర, ఆర్మూర్ మండలం మిర్దాపల్లిలో రూ. 3,300కు పడిపోయింది.