AP: హైదరాబాద్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలపై సీఎం చంద్రబాబు ఫోకస్ పెట్టారని తెలుస్తోంది. ఈ మేరకు ఉండవల్లి నివాసంలో చంద్రబాబుతో తెలంగాణ టీడీపీ నేతలు అరవింద్ కుమార్ గౌడ్, బక్కని నర్సింహులు భేటీ అయ్యారు. ఈ భేటీలో టీడీపీ అభ్యర్థిగా నందమూరి సుహాసిని పేరును నిర్ణయించినట్లుగా సమాచారం. కాగా, గతంలోనూ సుహాసిని జూబ్లీహిల్స్ ఉపఎన్నిక బరిలో నిలిచిన విషయం తెలిసిందే.