NDL: నంద్యాల పట్టణంలోని 14 వ వార్డులో ఇవాళ నూతన స్మార్ట్ రేషన్ కార్డులను మంత్రి ఫరూక్ తనయుడు ఫిరోజ్ లబ్ధిదారులకు పంపిణీ చేశారు. నూతన స్మార్ట్ రేషన్ కార్డుల ద్వారా ప్రజలు రేషన్ షాపులో నిత్యవసర సరుకులను తీసుకోవచ్చని ఆయన అన్నారు. ఈ అవకాశాన్ని పట్టణ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఫిరోజ్ తెలిపారు.