VSP: భీమిలి నియోజకవర్గంలోని ఆనందపురం-పెందుర్తి జాతీయ రహదారిలో మంగళవారం కారు బోల్తా పడింది. పరవాడలోని ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్న నలుగురు ఉద్యోగులు పార్వతీపురం మన్యం జిల్లాలో జరిగే ఓ వివాహ వేడుకలకు కారులో బయలుదేరారు. ఆనందపురం సమీపంలోని లోడగలవానిపాలెం సమీపంలో వర్షపు నీటిని తప్పించే క్రమంలో కారు అదుపుతప్పి బోల్తా పడింది.