TG: ఆర్టీసీ ఛార్జీల పెంపుపై BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR మండిపడ్డారు. మహిళలకు ఫ్రీ బస్సు అని ప్రచారం చేస్తూనే.. ప్రభుత్వం పురుషులు, విద్యార్థులపై అదనపు భారం మోపుతోందని విమర్శించారు. ఇంట్లో ఒక మహిళ ఉచితంగా ప్రయాణిస్తే, మిగిలిన సభ్యులందరికీ రెండింతలు ఛార్జీలు కట్టాల్సి వస్తోందని.. దీంతో ప్రతి కుటుంబానికీ నెలకు కనీసం రూ.2000 అదనపు భారం పడుతోందని పేర్కొన్నారు.