TG: జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ నేత ఒకరు ఉపఎన్నిక టికెట్ ఆశిస్తూ ఓటరు గుర్తింపు కార్డులను పంపిణీ చేస్తున్నారని కేటీఆర్ తీవ్ర ఆరోపణలు చేశారు. ‘ఓటరు కార్డులు పంపిణీ చేయడానికి ఆయన ఎవరు?’ అని కేటీఆర్ ప్రశ్నించారు. రాహుల్ గాంధీ చెబుతున్న ‘ఓటు చోరీ’ కంటే ఇది పెద్ద నేరం కాదా? అంటూ ఈ విషయాన్ని ఎన్నికల సంఘం తీవ్రంగా పరిగణించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.