SS:పెనుకొండ మండలం వెంకటగిరి పాళ్యం గ్రామానికి చెందిన రాష్ట్ర యాదవ కార్పొరేషన్ డైరెక్టర్ కేశవయ్య తమ్ముడు గోపాల్ యాదవ్ పై ఇటీవల కొందరు దాడి చేశారు. ఆయన అనంతపురం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న మంత్రి సవిత ఇవాళ ఆసుపత్రికి వెళ్ళి గోపాల్‌ను పరామర్శించారు. అనంతరం డాక్టర్‌తో మాట్లాడి గోపాల్‌కు మెరుగైన వైద్యం అందించాలన్నారు.