NLR: అల్లూరు మండలంలోని బట్రా కాగోళ్ళు గ్రామంలో ఇవాళ ఉచిత ఫెర్టిలిటీ వెటర్నరీ క్యాంప్‌ను నిర్వహించారు. ఈ క్యాంపులో భాగంగా దాదాపుగా 78 పశువులకు ఉచితంగా పరీక్షలు నిర్వహించి మందులను అందజేశారు. అనంతరం పాడి రైతులకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ అబ్దుల్ రహీం, ఏడి అల్లూరు డాక్టర్ మహేశ్వరయ్య, డాక్టర్ శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు.