MBNR: గో సంరక్షణ కోసం భక్తుల నుంచి వచ్చే విరాళాలు కానుకలను గో రక్షణ కోసం గోశాలల అభివృద్ధి కోసం ఉపయోగించాలని అఖిలభారత అయ్యప్ప దీక్ష ప్రచార సమితి ఆధ్వర్యంలో మంగళవారం ఎండోమెంట్ అధికారులకు వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో అఖిలభారత అయ్యప్ప దీక్ష ప్రచార సమితి అధ్యక్షులు సీమ నరేందర్, అన్నదాన కమిటీ అధ్యక్షులు రఘురాం గౌడ్, కోటేశ్వర రెడ్డి, కుమార్ పాల్గొన్నారు.