AKP: లింగ నిర్ధారణ పరీక్షలు జరగకుండా వైద్య ఆరోగ్య సిబ్బంది చూడాలని జిల్లా బాలల పరిరక్షణ కమిటీ సభ్యుడు లోవరాజు సూచించారు. మంగళవారం కసింకోట పీ.హెచ్.సీ.లో ఏఎన్ఎం, ఆశ కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. గర్భిణీలు, బాలింతలు, బాలల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. బాల్య వివాహాల వల్ల జరిగే అనర్థాలను వివరించాలన్నారు.