ATP: రాప్తాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో ఎమ్మెల్యే పరిటాల సునీత జీఎస్టీ తగ్గింపుపై ‘సూపర్ జీఎస్టీ – సూపర్ సేవ్’ కార్యక్రమంలో పాల్గొన్నారు. జీఎస్టీ రెండు స్లాబులుగా తగ్గిన కారణంగా ప్రజలపై భారం తగ్గిందని పేర్కొన్నారు. అనంతరం జీఎస్టీపై వ్యాసరచన, చిత్రలేఖనం పోటీల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు బహుమతులను ప్రధానం చేశారు.