SRPT: సమాచార హక్కు చట్టం ద్వారా పాలనలో పారదర్శకత, బాధ్యత పెరుగుతుందని కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ అన్నారు. మంగళవారం సూర్యాపేటలోని కలెక్టరేట్లో సమాచార హక్కు చట్టం వారోత్సవాల్లో భాగంగా అధికారులతో సమావేశం నిర్వహించి మాట్లాడారు. సమాచార హక్కు చట్టం కింద ప్రజలు కోరిన సమాచారాన్ని ఇవ్వాల్సిన బాధ్యత పౌర సమాచార అధికారులు, పబ్లిక్ అథారిటీలపై ఉందన్నారు.