VSP: భీమిలి నియోజకవర్గంలోని ఆనందపురంలో మంగళవారం మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. ఒక్కసారిగా కుండపోతగా వాన కురవడంతో ప్రజలు తీవ్ర అవస్థలు పడ్డారు. రోడ్లపైకి నీరు భారీగా చేరింది. వాహనదారులు వర్షంలో చిక్కుకుపోయారు. 16వ జాతీయ రహదారి జలమయంగా మారింది. పలు లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి.