WGL: రాయపర్తి మండలంలో మంగళవారం ఆకస్మిక పర్యటన చేసిన జిల్లా కలెక్టర్ సత్య శారద, జడ్పీటీసీ, ఎంపిటీసీ 2025 ఎన్నికల నామినేషన్ కేంద్రం ఏర్పాట్లను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. శివరాంపురం గ్రామంలో ప్రతిపాదిత చెక్ పోస్ట్‌ను సందర్శించి అక్టోబర్ 9వ తేదీ నుండి విస్తృత తనిఖీలు చేపట్టాలని ఆదేశించారు. నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ మోడల్ గృహ పనులను పరిశీలించారు.