ATP: పరిశుభ్రత పాటించడం వల్లనే సీజనల్ వ్యాధులకు చెక్ పెట్టవచ్చని మలేరియా సబ్ యూనిట్ అధికారి నాగేంద్ర ప్రసాద్ సూచించారు. రాయదుర్గం పట్టణం శాంతినగర్ వద్ద ఉన్న యుపీఎస్ సెంటర్ వద్ద ఆశా వర్కర్లతో ఇవాళ సమావేశం నిర్వహించారు. ప్రతి ఒక్కరూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకున్నప్పుడే మలేరియా, డెంగ్యూ తదితర సీజనల్ వ్యాధులు రాకుండా జాగ్రత్త పడవచ్చని సూచించారు.