SRD: పత్తి మద్దతు ధరకు స్లాట్ బుకింగ్ తప్పనిసరిగా చేయాలని మార్కెటింగ్ శాఖ ప్రాంతీయ సంచాలకులు మల్లేశం అన్నారు. సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో శిక్షణ సమావేశం మంగళవారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. రైతులు ముందుగా కిషన్ యాప్లో స్లాట్ బుక్ చేసుకుని సీసీఐ కేంద్రానికి పత్తిని తీసుకెళ్లాలని చెప్పారు.