KMM: వాహనాల నెంబర్ ప్లేట్లపై తప్పనిసరిగా వాహన నెంబర్ ఉండాలని వైరా ఎస్సై పుష్పాల రామారావు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి వాహనదారుడు వాహనానికి ముందు వెనక తప్పనిసరిగా నెంబర్ ప్లేట్ పై వాహన నెంబరు ఉండేలా చూసుకోవాలన్నారు. అలా కాకుండా వెనుక నెంబర్ ప్లేట్‌పై నెంబర్ కనిపించకుండా పేర్లు రాస్తే అలాంటి వాహనాలపై కేసులు నమోదు చేస్తామన్నారు.