ATP: అనంతపురంలో జూనియర్ కాలేజ్ నుంచి సప్తగిరి వరకు ఆటోడ్రైవర్లతో కలిసి దివ్యాంగ నేతలు ర్యాలీ నిర్వహించారు. ఎన్టీఆర్ విగ్రహం వద్ద సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఆటో డ్రైవర్లకు రూ. 15,000 ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు. కార్పొరేషన్ ఛైర్మన్ గడుపూటి నారాయణస్వామి పాల్గొన్నారు.