కోనసీమ: కోనసీమ నైపుణ్యాభివృద్ధి సంస్థ, జిల్లా ఉపాధి కార్యాలయం ఆధ్వర్యంలో బుధవారం రాజోలులోని శివకోడు చైతన్య ఐటీఐ కాలేజీ వద్ద మెగా జాబ్ మేళా నిర్వహించనున్నారు. జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి డి. హరి శేషు మంగళవారం ఈ విషయం తెలిపారు. ఈ మేళాలో దాదాపు 12 కంపెనీల్లో సుమారు 600 పైగా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్నారు. నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన తెలిపారు.