PLD: విద్యుత్ శాఖలో ఉద్యోగుల సమస్యలను పరిష్కరించకపోతే, ఈ నెల 15వ తేదీ నుంచి నిరవధిక సమ్మెను చేపట్టబోతున్నట్లు విద్యుత్ శాఖ జేఏసీ నాయకులు ప్రకటించారు. సమ్మెకు సంబంధించిన పోస్టర్లను నరసరావుపేట విద్యుత్ శాఖ కార్యాలయంలో మంగళవారం అధికారులు, సిబ్బందితో కలిసి ఆవిష్కరించారు. సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.