KMM: బోనకల్ గ్రామ పరిధిలో ఖమ్మం రోడ్డు సగర్ కాల వద్ద ప్రమాదం జరిగింది. కరెంటు శాఖ పనులు నిర్వహిస్తున్న ట్రాక్టర్ బోనకల్ నుండి ముష్టికుంట్లవైపు వెళ్తున్న ద్విచక్రవాహనాన్ని ఢీకొనడంతో ముష్టికుంట్లకు చెందిన దోసపాటి శశిధర్, బోయిన కొండల్ తీవ్రంగా గాయపడ్డారు. 108 సిబ్బంది చికిత్స అందించి, గాయపడిన వారిని ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.