AP: విజయనగరం సిరిమానోత్సవం వేడుకలో అపశృతి చోటుచేసుకుంది. సిరిమానోత్సవం తిలకించేందుకు ఏర్పాటు చేసిన వేదిక కూలిపోయింది. ఈ కార్యక్రమం ప్రారంభోత్సవానికి ముందు వర్షం పడటంతోనే ఘటన జరిగినట్లు సమాచారం. ఈ ఉత్సవాన్ని తిలకించేందుకు వైసీపీ MLC బొత్స సత్యనారాయణ కుటుంబ సమేతంగా వచ్చారు. ఈ ఘటనలో ఎవరికీ ఏం కాలేదని నిర్వాహకులు తెలిపారు.