అన్నమయ్య: చిట్వేలి మండల సర్వసభ్య సమావేశం బుధవారం ఉదయం 10 గంటలకు జరుగుతుందని మండల అభివృద్ధి అధికారి శ్రీనివాసులు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే అరవ శ్రీధర్ పాల్గొంటారని తెలిపారు. జడ్పీటీసీ ఎంపీటీసీ సర్పంచ్ తప్పనిసరిగా సమావేశంలో పాల్గొనాలని ఆయన స్పష్టం చేశారు. మండల స్థాయి అధికారులు వారి శాఖలకు సంబంధించిన పూర్తి సమాచారంతో హాజరు కావాలని కోరారు