GNTR: తురకపాలెంలో వరస మరణాలపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెంటనే స్పందించాలని ఏఐవైఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు షేక్ వలి విజ్ఞప్తి చేశారు. మంగళవారం కొత్తపేట ఏఐవైఎఫ్ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం సీరియస్గా ఉండలేదని, మరో ఉద్దానం కాకుండా ఆనాడు పోరాటం చేసిన పవన్ కళ్యాణ్ నేడు తురకపాలెం గ్రామాన్ని కాపాడాలన్నారు.