TG: జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి రేసులో తాను లేనని మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ స్పష్టం చేశారు. టికెట్ కోసం తాను ఎవరినీ అడగలేదని, అధిష్ఠానమే అభ్యర్థిని నిర్ణయిస్తుందని తెలిపారు. టికెట్ ఇచ్చినా, ఇవ్వకపోయినా కాంగ్రెస్ గెలుపు కోసం పనిచేస్తానని పేర్కొన్నారు. ఈ నియోజకవర్గానికి నలుగురి పేర్లను PCC అధిష్ఠానానికి పంపింది. వీరిలో ఒకరిని AICC ప్రకటించనుంది.