TG: బీజేపీ నగర కార్యాలయంలో జూబ్లీహిల్స్ నియోజకవర్గ నేతల భేటీ జరిగింది. అభ్యర్థి ఎంపిక కోసం నియమించిన త్రిసభ్య కమిటీ నేతలతో చర్చలు జరిపింది. ఈ సమావేశంలో టికెట్ ఆశావహులు కూడా పాల్గొన్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో గెలుపు గుర్రంపై నేతల అభిప్రాయాలను కమిటీ అడిగి తెలుసుకుంటోంది. త్వరలోనే అభ్యర్థిని ప్రకటించే అవకాశమున్నట్లు తెలుస్తోంది.