AP: తిరుమలలో ఇవాళ జోరు వాన కురిసింది. సుమారు మూడు గంటలపాటు కురిసిన వర్షానికి తిరుమల ఆలయ ప్రాంగణంతో పాటు పరిసరాల ప్రాంతాలు జలమయం అయ్యాయి. వర్షం పడడంతో దర్శనానంతరం గదులకు వెళ్లేందుకు, లడ్డూ విక్రయ కేంద్రాలకు వెళ్లేందుకు భక్తులు ఇబ్బంది పడ్డారు. ఇటీవల బ్రహ్మోత్సవాలకు టీటీడీ ఏర్పాటు చేసిన షెడ్ల వద్ద భక్తులు తలదాచుకున్నారు.