TPT: ఒంటిమిట్ట మండలంలోని నరసన్నగారిపల్లెలో కొందరు తనపై దాడి చేశారని ఓ వివాహిత పోలీసులకు మంగళవారం ఫిర్యాదు చేశారు. గ్రామంలో నిర్మించిన రామాలయంలో సోమవారం ధ్వజస్తంభాన్ని ఏర్పాటు చేశారు. భక్తుల కోసం అన్నదానం ఏర్పాటు చేశారు. ఆ సమయంలో రెండు వర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో ఆమెపై ఆలోచితంగా ప్రవర్తించి దాడి చేశారు. దీంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించారు.