TPT: విశ్వవిద్యా లయాల్లో PHD ప్రవేశాలకు రాష్ట్ర వ్యాప్తంగా శ్రీ పద్మావతి మహిళా వర్సిటీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఏపీ ఆర్‌సెట్-24 ప్రవేశ పరీక్షలు నవంబర్ 3 నుంచి 7 వరకు జరుగుతాయని కన్వినర్ ఉష తెలిపారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో మొత్తం 14 సెంటర్లలో పరీక్షలు జరుగుతాయని అన్నారు. కాగా, ఆన్లైన్ ద్వారా జరిగే ఈ పరీక్షలకు అభ్యర్థులు ఈనెల 21 లోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు.