GNTR: జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు అనుమతుల మంజూరులో జాప్యం చేయరాదని జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా ఆదేశించారు. మంగళవారం జిల్లా పరిశ్రమలు, ఎగుమతుల ప్రోత్సాహక మండలి సమావేశం కలెక్టరేట్లో నిర్వహించారు. ఈ సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ.. ఒక కుటుంబం- ఒక పారిశ్రామికవేత్త భాగంగా ప్రతి కుటుంబంపై దృష్టి సారించి ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించాలన్నారు.