ప్రకాశం: మాదకద్రవ్యాలు, పేలుడు పదార్థాల తరలింపును అరికట్టేందుకు జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు మంగళవారం పొదిలి పట్టణంలో పోలీసులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. పోలీసు జాగిలాలతో అధికారులు ముఖ్యమైన ప్రాంతాలను క్షుణ్ణంగా పరిశీలించారు. అయితే, ఎటువంటి మాదకద్రవ్యాలు, పేలుడు పదార్థాలు గుర్తించబడలేదని అధికారులు తెలిపారు.