KDP: పెండ్లిమర్రి మండల పరిధి అరవేటిపల్లి,గోపరాజుపల్లి గ్రామాల్లో మద్యం అక్రమంగా విక్రయిస్తున్నారననే సమాచారం రావడంతో సిబ్బందితో కలిసి దాడులు నిర్వహించామని SI మధుసూదన్ రెడ్డి తెలిపారు. అరవేటి పల్లెలో నరేంద్ర అనే వ్యక్తి నుంచి 10 మద్యం సీసాలు, గోపరాజుపల్లెలో గంగన్న నుంచి 12, ఆదినారాయణ నుంచి 15 మద్యం సీసాలు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు SI తెలిపారు.