శబరిమల ఆలయం తులం మాస పూజల కోసం ఈనెల 17 సా.5 గంటలకు తెరుచుకోనుంది. పూజలు, దర్శనం ఈనెల 22 వరకు కొనసాగి, రా.10 గంటలకు ఆలయం మూతపడుతుంది. ఈ ఐదు రోజుల పాటు భక్తులకు శ్రీ చిత్ర ఆట్ట తిరునాల్ పండుగ సందర్భంగా అదనపు దర్శన సమయాలు కూడా ఉంటాయి. దర్శనం టిక్కెట్లను sabarimalaonline.org ద్వారా బుక్ చేసుకోవచ్చు. అయ్యప్ప భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు.