NLR: మహిళలపై జరిగే నేరాల నివారణపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని పోలీసులకు గుంటూరు రేంజ్ ఐజీ సర్వ శ్రేష్ట త్రిపాఠి ఆదేశించారు. మంగళవారం మినీ కాన్ఫరెన్స్ హాల్లో DSP, ఆపై స్థాయి పోలీసు అధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లాలో ప్రస్తుత పరిస్థితులు, తీసుకోవాల్సిన చర్యలను ఆరా తీశారు. ప్రాపర్టీ, రౌడీ ఎలెమెంట్స్, పోక్సో వంటి కేసులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు.