KRNL: ఆదోనిలో బైకుల చోరీలకు పాల్పడిన చౌటపల్లి గ్రామానికి చెందిన వీరేష్ అనే వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు CI రాజశేఖర్రెడ్డి తెలిపారు. ఆస్పరి రోడ్డులో పట్టుబడిన అతని వద్ద నుంచి రూ. 2.97 లక్షల విలువైన 6 బైకులు స్వాధీనం చేసుకున్నారు. గత నెల 5న భీమాస్ సర్కిల్ వద్ద జరిగిన బైక్ చోరీ కేసును దర్యాప్తు చేసిన టౌన్ పోలీసులు సాంకేతిక ఆధారాలతో నిందితుడిని గుర్తించారు.