MBNR: ఈనెల 17వ తేదీ నుంచి అక్టోబర్ 16వ తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా పోషణ మాసం కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి వెల్లడించారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో పోషణ మాసానికి సంబంధించిన పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి జరీనా బేగం పాల్గొన్నారు.