మహిళల వన్డే ప్రపంచకప్లో భాగంగా ఈనెల 9 నుంచి విశాఖపట్నం ACA-VDCA స్టేడియంలో ఐదు మ్యాచ్లు జరగనున్నాయి. అయితే, 12న జరిగే భారత్- ఆస్ట్రేలియా మ్యాచ్ను వీక్షించేందుకు ప్రేక్షకులకు ఏసీఏ చక్కటి అవకాశం కల్పించింది. టికెట్ ధర రూ.150లుగా నిర్ణయించింది. మిగిలిన అన్ని మ్యాచ్లకు రూ.100లకే టికెట్ కొని మ్యాచ్ చూసే వెసులుబాటు కల్పించింది.