ATP: జిల్లాకు స్పీక్ కంపెనీకి చెందిన 988.87 మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా అయినట్లు జిల్లా ఏడీఏ అల్తాఫ్ అలీఖాన్ పేర్కొన్నారు. స్థానిక ప్రసన్నాయ పల్లి రైల్వే స్టేషన్కు వెళ్లి మంగళవారం ఆయన పరిశీలించారు. జేసీ ఆదేశాల మేరకు ఏపీ మార్ఫెడ్కు 649.88, ప్రైవేటు డీలర్లు, 338.89 మెట్రిక్ టన్నుల యూరియాను సరఫరా చేసినట్లు వివరించారు.